వలస కార్మికుడిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2021-12-28T06:19:29+05:30 IST

ఉపాధి కోసం వలస వచ్చిన కార్మికుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

వలస కార్మికుడిని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

చౌటుప్పల్‌ రూరల్‌, డిసెంబరు 27: ఉపాధి కోసం వలస వచ్చిన కార్మికుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీ్‌సఘఢ్‌ రాషా్ట్రనికి చెందిన సంతోష్‌(25) చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెం శివారులోని కట్టె మిల్లులో  కార్మికుడిగా కొంతకాలంగా పనిచేస్తున్నాడు. స్వగ్రామం వెళ్లడానికి ఆదివారం రాత్రి ఆరేగూడెం స్టేజీ వద్ద రోడ్డు దాటుతుండగా సూర్యాపేట డిపోకి చెందిన ఆర్టీసీ బస్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయడిని సంతో్‌షను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో మృతి చెందాడు.  సంతో్‌షకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడికి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్‌ పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-12-28T06:19:29+05:30 IST