పేదల ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-08-27T05:41:41+05:30 IST

జిల్లాలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లు పంపిణీతో పాటు, స్థలమున్న ప్రతీ పేదవారి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పేదల ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలి
రిలే దీక్షలో మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

నల్లగొండ టౌన, ఆగస్టు 26 :  జిల్లాలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లు పంపిణీతో పాటు,  స్థలమున్న ప్రతీ పేదవారి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్ష మూడోరోజు గురువారం ఆయన హాజరై మాట్లాడారు. సీఎం దత్తత తీసుకున్న నల్లగొండ పట్టణంలో పేదలకు ఇంతవరకు ఇంటి జాగా ఇవ్వలేదన్నారు. పట్టణంలో నిర్మించిన 552 డబుల్‌ బెడ్రూం ఇళ్లు మౌలిక సదుపాయాలు లేక శిథిలావస్థకు చేరాయన్నారు.   వీటికోసం పట్టణంలో 10వేల మంది దరఖాస్తులు చేసుకున్నారని వెంటనే సర్వే చేసి అర్హులకు  డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికలపుడు అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ మేల్కొని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేనిచో గద్దెదించే వరకు పోరాడుతామని హెచ్చరించా రు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి ఎండీ.సలీం, పట్టణ కమిటీ సభ్యులు ఊట్కూరి నారాయణరెడ్డి, కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నర్సింహ, పిన్నపురెడ్డి మధుసూదనరెడ్డి, గాదె నర్సింహ, భూతం అరుణకుమారి, గుండాల నరేష్‌, గడగోజు శ్రీనివాసచారి, కుంభం లక్ష్మమ్మ, భాషపాక గణేష్‌, చిట్టిప్రోలు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-27T05:41:41+05:30 IST