ఎకరానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-10-25T06:30:52+05:30 IST
నసర్లపల్లి రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెస ర్ కోదండరాం అన్నారు. మండలంలోని నసర్లపల్లి గ్రామంలో భూ నిర్వాసితులతో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
చింతపల్లి, అక్టోబరు 24: నసర్లపల్లి రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెస ర్ కోదండరాం అన్నారు. మండలంలోని నసర్లపల్లి గ్రామంలో భూ నిర్వాసితులతో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరానికి రూ.50 లక్షలు ధర పలుకుతోందన్నారు. రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.20 లక్షలు, కుటుంబంలో ఒకరి కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశం లో నాయకులు పల్లె వినయ్‌కుమార్, పాపిరెడ్డి, తిరుమల్‌రెడ్డి, కిరణ్, సత్యానారాయణ తదితరులు పాల్గొన్నారు.