రూ.2 కోట్ల రుణాలు వెనక్కి

ABN , First Publish Date - 2021-11-02T06:18:52+05:30 IST

హుజూర్‌నగర్‌ సహకార సంఘం సీఈవో తీరుతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖరీ్‌ఫలో రైతులకు మంజూరైన రూ.25 లక్షల పంట రుణాలతో పాటు ఎల్‌టీ, మార్టిగేట్‌ రుణాల కోసం మంజూరైన రూ.2 కోట్లు కూడా వెనక్కి వెళ్లాయి.

రూ.2 కోట్ల రుణాలు వెనక్కి
హుజూర్‌నగర్‌ పీఏసీఎస్‌ కార్యాలయం

ఖరీఫ్‌ రుణాలు పంపిణీ చేయని సీఈవో

బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన డీసీసీబీ అధికారులు

రుణ లబ్ధిపొందని 2 వేల మంది సభ్యులు

సీఈవోను బదిలీ చేయాలని తీర్మానం

హుజూర్‌నగర్‌ , నవంబరు 1 : హుజూర్‌నగర్‌ సహకార సంఘం సీఈవో తీరుతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖరీ్‌ఫలో రైతులకు మంజూరైన రూ.25 లక్షల పంట రుణాలతో పాటు ఎల్‌టీ, మార్టిగేట్‌ రుణాల కోసం మంజూరైన రూ.2 కోట్లు కూడా వెనక్కి వెళ్లాయి. సంఘంలో సుమారు రెండు వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. అధికారి నిర్వాకంతో ఖరీఫ్‌ సీజన్‌లో ఒక్క రూపాయి రుణం కూడా రైతులకు దక్కకుండాపోయింది. దీనికి తోడు సం ఘం బ్లాక్‌లిస్టులోకి వెళ్లింది. ఇంత జరుగుతున్నా సంఘంలోని కొందరు సభ్యులు ఆయనకు మద్దతు పలకడం గమనార్హం. దీనికి తోడు గత రుణాలు చెల్లి స్తేనే కొత్తరుణాలు, మాఫీ అని తెగేసి చెప్పడంతో రైతులు రుణ, వడ్డీ చెల్లింపులకు ముందుకు రాలేదు. అంతేకాకుండా వడ్డీ చెల్లిస్తే చాలు అదనపు రుణం చెల్లించేందుకు ప్రభుత్వం కల్పించిన విషయాన్ని సైతం రైతుల వద్ద దాచి పెట్టారు. దీంతో వడ్డీ భారం పెరిగింది. 35 పైసలు చెల్లించాల్సిన రైతులు ప్రస్తుతం సీఈవో తీరుతో రూ.1.35 చెల్లించాల్సి వస్తుందని రైతులు ఆరోపిస్తూ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

డీసీసీబీ ఆదేశించినా... 

ఖరీ్‌ఫకు సంబంధించి ఈ ఏడాది, మార్చి చివరి వరకు రైతులకు రుణాలు ఇవ్వాలని డీసీసీబీ అధికారులు ఆదేశించారు. ఇందుకోసం ఖరీఫ్‌ ప్రారంభంలో ప్రభుత్వ రుణాలు, వడ్డీ మాఫీ, రుణమాఫీ, రెన్యువల్‌కు సంబంధించి వడ్డీలు, అదనపు రుణా ల మంజూరు విషయాలపై రైతులకు వివరించా ల్సి ఉన్నా అధికారులు ఆ పనీ చేయలేదు. దీనికితోడు గత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని మెలికపెట్టారు. దీంతో వడ్డీ చెల్లింపులు, రుణ మాఫీ కాని రైతులు చేయించుకోలేదు. ఈ క్రమంలో రైతులపై బకాయిల బండ పెరిగింది. 

తాపీగా పాలకవర్గానికి సమాచారం

ఖరీ్‌ఫలో రైతుల చెల్లింపులు లేకపోవడం, కొత్త రుణాలు అందజేయకపోవడాన్ని డీసీసీబీ అధికారులు సీరియ్‌సగా తీసుకున్నారు. పీఏసీఎ్‌సను బ్యాంక్‌ అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టారు. కొత్త రుణాలు ఇచ్చే అవకాశం లేకుండా చేయడంతో పాటు ఖరీఫ్‌ రుణ చెల్లింపుల కోసం ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకున్నారు. దీంతో సమావేశాన్ని ఏర్పాటు చేసి విషయాన్ని పీఏసీఎస్‌ అధికారులు పాలకవర్గ సభ్యులకు తెలిపారు. సభ్యులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

..అయినా సీఈవోకు మద్దతు

సంఘంలో ఇంత జరుగుతున్నా సీఈవో వివరాలను పాలకవర్గానికి సకాలంలో తెలపలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో సమావేశంలో సభ్యులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్‌ చేయాలని నిర్ణయించారు. అయితే కొంతమంది డైరెక్టర్లు సీఈవోకు మద్దతు పలకడంతో సస్పెండ్‌ కాస్త బదిలీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు పాలకవర్గం సీఈవోను బదిలీ చేయాలని తీర్మానించింది. ఈ విషయాన్ని బ్యాంక్‌ అధికారులకు ఫిర్యాదుచేశారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 


రైతులను ఇబ్బంది పెట్టవద్దనే పులిచింతల నరేందర్‌రెడ్డి, సీఈవో

రైతులను ఇబ్బంది పెట్టవద్దనే రుణాలు వసూలు చేయలేదని సీఈవో పులిచింతల నరేందర్‌రెడ్డి అన్నారు. రైతులు రుణమాఫీ వస్తుందని, తాము ఇప్పుడే చెల్లించమని చెప్పారని, కొంతమంది చెల్లించిన రుణాలు సేవింగ్స్‌ ఖాతాలో జమచేశామన్నారు. గతంలో తీసుకున్న రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇవ్వాలన్న నిబంధన ఉందన్నారు. అందుకనే కొత్త లోన్లు ఇవ్వలేదన్నారు.


సీఈవో బదిలీకి తీర్మానం: యరగాని శ్రీనివాస్‌, చైర్మన్‌

సీఈవో నరేందర్‌రెడ్డిని బదిలీ చేయాలని తీర్మానించినట్లు పీఏసీఎస్‌ చైర్మన్‌ యరగాని శ్రీనివాస్‌ తెలిపారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. రైతులకు రుణాలు ఇవ్వలేదు. కొత్త రుణాలకు సంబంధించి వివరాలు సభ్యులకు చెప్పలేదన్నారు. పీఏసీఎ్‌సకు నిధులు రాకుండా నోటీసులు ఇచ్చి బ్లాక్‌లి్‌స్టలో పెట్టారన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడితే త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 

Updated Date - 2021-11-02T06:18:52+05:30 IST