శతాధిక వృద్ధురాలికి ఘనంగా సన్మానం

ABN , First Publish Date - 2021-12-08T07:05:23+05:30 IST

మండలకేంద్రంలోని మీరసాహెబ్‌గూడేనికి చెందిన గుండు చంద్రమ్మ మంగళవారం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

శతాధిక వృద్ధురాలికి ఘనంగా సన్మానం
శతాధిక వృద్ధురాలు చంద్రమ్మ కుటుంబం
కట్టంగూర్‌ :  మండలకేంద్రంలోని మీరసాహెబ్‌గూడేనికి చెందిన గుండు చంద్రమ్మ మంగళవారం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. చంద్రమ్మకు ఇద్దరు కుమారులు, 5గురు కుమార్తెలు ఉన్నారు. చంద్రమ్మ తన కుటుంబ సభ్యులు మొత్తం 76 మందితో ఆనందగా ఉన్నారు. కార్యక్రమంలో కుమారులు గుండు కొండయ్య, గోపయ్య, కుమార్తెలు సోవమ్మ, సైదమ్మ, ఎల్లమ్మచ పద్మ, ఇంద్రమ్మ, మనువళ్లు, మనవరాళ్లు, ముని మనుమళ్లు, ముని మనుమరాళ్లు ఉన్నారు. 

Updated Date - 2021-12-08T07:05:23+05:30 IST