రేవంత్‌రెడ్డి బాధ్యతలస్వీకారానికి తరలిన శ్రేణులు

ABN , First Publish Date - 2021-07-08T05:51:43+05:30 IST

టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బాధ్యతలస్వీకార కార్యక్రమానికి జిల్లాలోని కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా హైదరాబాద్‌కు తరలివెళ్లాయి.

రేవంత్‌రెడ్డి బాధ్యతలస్వీకారానికి తరలిన శ్రేణులు
సూర్యాపేటలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న కాంగ్రెస్‌ నాయకుడు ముదిరెడ్డి రమణారెడ్డి

సూర్యాపేటటౌన్‌ / మునగాల / నూతనకల్‌ / మద్దిరాల, జూలై 7: టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బాధ్యతలస్వీకార కార్యక్రమానికి జిల్లాలోని కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా హైదరాబాద్‌కు తరలివెళ్లాయి. సూర్యాపేటలో కాంగ్రెస్‌ నాయకుడు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫిఉల్లా, వెలుగు వెంకన్న, అబ్ధుల్‌ రహీం, వల్ధాస్‌ దేవేందర్‌, పాలవరపు వేణు, యాట వెంకన్న, గట్టు శ్రీను పాల్గొన్నారు. అదేవిధంగా మాజీమంత్రి దామోదర్‌రెడ్డి నివాసం నుంచి కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు అంజద్‌అలీ ఆధ్వర్యంలో కార్యకర్తలు వాహనాల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బైరు శైలేందర్‌గౌడ్‌, కక్కిరేణి శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ ధరావత్‌ వీరన్ననాయక్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మునగాల మండలం నుంచి  కాంగ్రెస్‌ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి వేమూరి సత్యనారాయణ, నాయకులు గుండు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, బారి లక్ష్మయ్య  పాల్గొనేందుకు వెళ్లారు.  నూతనకల్‌ మండలం నుంచి హైదరాబాద్‌కు తరలిన వారిలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్‌రెడ్డి, తీగల గిరిధర్‌రెడ్డి, దరిపెల్లి వీరన్న, ఉప్పుల పాపయ్య, రాచకొండ అయోధ్య, కాస రంగయ్య, రాంచందర్‌రావు, గుణగంటి వెంకన్న, ఇరుగు కిరణ్‌ ఉన్నారు. మద్దిరాల నుంచి  పచ్చిపాల వెంకన్న, పసుల అశోక్‌, కుతుబుద్దీన్‌, మోహన్‌రెడ్డి వెళ్లారు. 

Updated Date - 2021-07-08T05:51:43+05:30 IST