రేవంత్‌రెడ్డి హౌస్‌ అరెస్టు పిరికిపంద చర్య

ABN , First Publish Date - 2021-12-28T06:37:39+05:30 IST

ఎర్రబెల్లిలో కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందు కు వెళ్తున్న టీపీసీసీ అఽధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని హౌస్‌ అరెస్టు చేయడం, కాంగ్రెస్‌ నాయకుల ను అదుపులోకి తీసుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని టీపీసీసీ అధికార

రేవంత్‌రెడ్డి హౌస్‌ అరెస్టు పిరికిపంద చర్య
నల్లగొండలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలా్‌షనేత

నల్లగొండ టౌన్‌, డిసెంబరు 27: ఎర్రబెల్లిలో కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందు కు వెళ్తున్న టీపీసీసీ అఽధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని హౌస్‌ అరెస్టు చేయడం, కాంగ్రెస్‌ నాయకుల ను అదుపులోకి తీసుకోవడం ప్రభుత్వ పిరికిపంద చర్య అని టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలా్‌షనేత అన్నారు. రేవంత్‌రెడ్డి అరెస్టును ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను సోమవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎర్రబెల్లి కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో 150 ఎకరాల్లో వరి సాగుచేసిన అంశాన్ని మీడియాకు చూపిస్తానని రేవంత్‌రెడ్డి వెల్లడించడంతో సీఎం వెన్నులో వణుకుపుట్టిందన్నారు. అర్ధరాత్రి నుంచే రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు పహారాగా ఉంటూ ఆయన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టులాంటిదన్నారు. వచ్చే రోజుల్లో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రైతులను మోసం చేస్తున్న కేసీఆర్‌, మోదీలను ప్రజా కోర్టు లో దోషులుగా నిలబెడతామన్నారు. రైతుల పక్షాన పోరాడే దమ్ము, ధైర్యం కాంగ్రెస్‌ పార్టీకే ఉందన్నారు. రైతు సమస్యలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరుద్యోగ దీక్ష చేపట్టారన్నారు. రైతుల ఆత్మహత్యలకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలే ప్రధాన కారణమన్నారు. వరి వద్దని చెబుతున్న సీఎం కేసీఆర్‌ మాత్రం తన పొలంలో వరి సాగు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో నల్లగొండ వైస్‌ ఎంపీపీ జిల్లెపల్లి పరమేష్‌, సుంకిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆదిమళ్ల శంకర్‌, పెరిక వెంకటేశ్వర్లు, అల్లి సుభాష్‌, నాగార్జున, మదన్‌, సతీష్‌, క్రాంతి, సోనూ, ఉబేద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-28T06:37:39+05:30 IST