శశిధర్‌రెడ్డి హత్య కేసులో బంధువుల హస్తం ?

ABN , First Publish Date - 2021-02-05T05:33:32+05:30 IST

సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని కుడకుడలో ఈనెల 1వ తేదీన హత్యకు గురైన శశిధర్‌రెడ్డి హత్య కేసులో నకిరేకల్‌ రియల్టర్‌తోపాటు సొంత బంధువులు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

శశిధర్‌రెడ్డి హత్య కేసులో బంధువుల హస్తం ?

ముమ్మరంగా కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

చివ్వెంల, ఫిబ్రవరి 4: సూర్యాపేట జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని కుడకుడలో ఈనెల 1వ తేదీన హత్యకు గురైన శశిధర్‌రెడ్డి హత్య కేసులో నకిరేకల్‌ రియల్టర్‌తోపాటు సొంత బంధువులు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. శశిధర్‌రెడ్డికి, తన బంధువులకు గత కొన్నేళ్లుగా సొంత భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. శశిఽధ్‌రెడ్డితో తరుచూ వివాదంలో ఉన్న నకిరేకల్‌ రియల్టర్‌తో స్నేహం చేసిన శశిధర్‌రెడ్డి బంధువులు ఇద్దరి సమస్య పరిష్కారం కావాలంటే హతమార్చడమే మార్గంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు రియల్టర్‌తో కలిసి హత్యకు పథక రచనలో పాలుపంచుకున్నారని, ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-02-05T05:33:32+05:30 IST