ఇంటర్‌ బోర్డు వైఖరితోనే తగ్గిన ఉత్తీర్ణత శాతం : ఎనఎస్‌యూఐ

ABN , First Publish Date - 2021-12-20T05:26:23+05:30 IST

ఇంటర్‌ బోర్డు వైఖరితోనే ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందని ఎనఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్‌ అన్నారు.

ఇంటర్‌ బోర్డు వైఖరితోనే తగ్గిన ఉత్తీర్ణత శాతం : ఎనఎస్‌యూఐ
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంగ ప్రవీణ్‌

 భువనగిరిటౌన, డిసెంబరు 19: ఇంటర్‌ బోర్డు వైఖరితోనే ప్రథమ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందని ఎనఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్‌ అన్నారు. ఆదివారం భువనగిరి పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కారణంగా పూర్తి స్థాయి ప్రత్యక్ష తరగతులు జరగకున్నా విద్యార్థులతో బలవంతంగా పరీక్షలు రాయించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు ఎదుట ఆందోళన చేస్తున్న ఎనఎ్‌సయూఐ నాయకులను అరెస్ట్‌ చేయడాన్ని నిరసి స్తూ సోమవారం ఇంటర్‌ కళాశాలల తరగతులను బహిష్కరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సురిపంగ చందుశరత, నాయకులు ఎండి మసూద్‌, తోటకూరి శేఖర్‌, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-20T05:26:23+05:30 IST