250 యూనిట్ల విద్యుత్‌కు రజకులు దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-21T05:57:14+05:30 IST

ఇస్త్రీ చేసే రజకులు నెలకు 250యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా పొందడానికి ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రజక సం ఘాల చీఫ్‌ అడ్వయిజర్‌ కొండూరు సత్యనారాయణ తెలిపారు.

250 యూనిట్ల విద్యుత్‌కు రజకులు దరఖాస్తు చేసుకోవాలి

సమావేశంలో మాట్లాడుతున్న సత్యనారాయణ

నల్లగొండ క్రైం, జూన్‌ 20: ఇస్త్రీ చేసే రజకులు నెలకు 250యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా పొందడానికి ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రజక సం ఘాల చీఫ్‌ అడ్వయిజర్‌ కొండూరు సత్యనారాయణ తెలిపారు. జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం మాట్లాడారు. రజకులు మురికి నీళ్లతో బట్టలు ఉతికి అనారోగ్యాలకు గురి కాకుండా బెంగళూరు తరహాలో రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టు కింద 11ప్రాంతాల్లో ఆధునిక దోభీ ఘాట్లను రూ.52లక్షలతో ఏర్పాటు చేయడం సీఎం కేసీఆర్‌ నిర్ణయం చారిత్రాత్మ కమన్నారు. రాష్ట్రంలో ఇస్త్రీ చేసే సుమారు 2లక్షల మంది రజకులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పై ఏడాదికి రూ.200 కోట్ల భారం పడుతున్నా సీఎం కేసీఆర్‌ ఉచిత విద్యుత్‌ ప్రకటించడం హర్షనీయ మన్నా రు. బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్‌ కృషి ఉందని, అందులో భాగంగానే విధి విధానాల్లో ట్రేడ్‌ లైసెన్స్‌, రెంటల్‌ ఒప్పందం, కమర్షియల్‌ కాకుండా ఎల్‌టీ 4(ఏ) స్పెషల్‌ కేటగిరి కింద విధివిధానాలను ప్రభుత్వం సులబతరం చేసిందన్నారు. రజకులు కులం సర్టిఫికెట్‌, ఆధార్‌కార్డు, పాస్‌ఫొటో, ఇస్త్రీ ఫొటోతో ఆన్‌ లైన్‌లో దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలోని ఇళ్లలో, మడిగెల్లో, డబ్బాల్లో, అపార్ట్‌ మెంట్ల కింద ఇస్ర్తీ చేసే వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమా వేశంలో సమితి జిల్లా అధ్యక్షుడు చిలుకరాజు చెన్నయ్య, జిల్లా కో కన్వీనర్‌ లకడాపురం వెంకన్న, నాయకులు చిం తల వెంకన్న, నాగిళ్ల యాదయ్య, దామునూరి శ్రీను, భీమనపల్లి శంకర్‌ చిక్కుల శ్రీను, జంజిరాల పుల్లయ్య, సట్టు బుచ్చిరాములు, గడ్డం మారయ్య, నలపరాజు నర్సింహ, ఎలిజాల వెంకన్న, చర్లపల్లి మల్లేశం ఉన్నారు. 

Updated Date - 2021-06-21T05:57:14+05:30 IST