దేశ రక్షణ కోసం ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌

ABN , First Publish Date - 2021-10-28T05:40:13+05:30 IST

దేశ రక్షణ కోసం ర్యాపిడ్‌ యాక్షన్‌ఫోర్స్‌ పనిచేస్తుందని దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి అన్నారు.

దేశ రక్షణ కోసం ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌
దేవరకొండలో ర్యాపిడ్‌ యాక్షన్‌ఫోర్స్‌ కవాతులో పాల్గొన్న డీఎస్పీ ఆనంద్‌రెడ్డి

 డీఎస్పీ ఆనంద్‌రెడ్డి 

దేవరకొండ, అక్టోబరు 27: దేశ రక్షణ కోసం ర్యాపిడ్‌ యాక్షన్‌ఫోర్స్‌ పనిచేస్తుందని దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి అన్నారు. బుధవారం దేవరకొండ పాత పోలీస్‌స్టేషన్‌ నుంచి ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ కవాతును ప్రారంభించి పాల్గొని ఆయన మాట్లాడారు. అన్ని రాష్ర్టాలలో ర్యాపిడ్‌ యాక్షన్‌ఫోర్స్‌ కవాతు నిర్వహిస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తుందన్నారు. పట్టణంలోని పాత పోలీస్‌స్టేషన్‌, ముత్యాలమ్మ వీధి, మీనాక్షి సెంటర్‌ నుంచి బస్టాండ్‌ వరకు రాపిడ్‌ యాక్షన్‌ఫోర్స్‌తోపాటు దేవరకొండ పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో దేవరకొండ సీఐ బీసన్న, ఎస్‌ఐలు నారాయణరెడ్డి, వెంకటయ్య, మణికంఠరాజు, ఆంజనేయులు, పోలీసులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T05:40:13+05:30 IST