ఎస్పీగా రమారాజేశ్వరి

ABN , First Publish Date - 2021-12-25T06:33:20+05:30 IST

జిల్లా ఎస్పీగా రమారాజేశ్వరిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 30మంది ఐపీఎస్‌లు బదిలీ కాగా, ఎస్పీగా పనిచేస్తున్న ఏవీ.రంగనాథ్‌ను హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా బదిలీచేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఎస్పీగా రమారాజేశ్వరి
రమారాజేశ్వరి

ప్రస్తుత ఎస్పీ రంగనాథ్‌ హైదరాబాద్‌కు బదిలీ 


నల్లగొండ క్రైం, డిసెంబరు 24: జిల్లా ఎస్పీగా రమారాజేశ్వరిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 30మంది ఐపీఎస్‌లు బదిలీ కాగా, ఎస్పీగా పనిచేస్తున్న ఏవీ.రంగనాథ్‌ను హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌గా బదిలీచేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మూడేళ్ల క్రితం జిల్లా ఎస్పీగా వచ్చిన రంగనాథ్‌ పోలీస్‌ శాఖ, ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. నల్లగొండ ఎస్పీగా సుదీర్ఘకాలం పని చేసిన ఏవీ.రంగనాఽథ్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేయగా ప్రస్తుతం ఐజీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న ఎస్పీ రమారాజేశ్వరిని నల్లగొండ ఎస్పీగా ప్రభుత్వం నియమించింది.

Updated Date - 2021-12-25T06:33:20+05:30 IST