ప్రోటోకాల్‌ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-31T16:28:08+05:30 IST

అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ పాటించకుండా ప్రజాప్రతినిధులను అగౌరవపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నూతన్‌ కల్‌ ఎంపీటీసీ పన్నాల రమ మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు.

ప్రోటోకాల్‌ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి

 నూతన్‌కల్‌ డిసెంబరు 30: అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ పాటించకుండా ప్రజాప్రతినిధులను అగౌరవపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నూతన్‌ కల్‌ ఎంపీటీసీ పన్నాల రమ మల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. మండలకేంద్రంలో గురు వారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మండల పరిషత్‌ కార్యాలయంలో  జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎంపీటీసీ అయిన తనను వేదికపైకి ఆహ్వానించలేదని, దీనిపై తాహసీల్దార్‌ను ప్రశ్నించగా అగౌరవంగా మా ట్లాడారని ఆరోపించారు. ఈ విషయమై తాహసీల్దార్‌ జమీరుద్దీన్‌ను వివరణ కోరగా మండలస్థాయి కార్యక్రమం అయినందున ఎంపీటీసీని వేదికపైకి ఆహ్వానించలేదని, ఎంపీటీసీ పట్ల తాను అగౌరవంగా మాట్లాడలేదని తెలిపారు. 

Updated Date - 2021-12-31T16:28:08+05:30 IST