జిల్లాలో కురిసిన వర్షం

ABN , First Publish Date - 2021-08-27T06:15:52+05:30 IST

జిల్లాలో గురువారం వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బులతో మేఘావృతమై సాయంత్రం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలోని పలు మండలాల్లోని చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నా యి.

జిల్లాలో కురిసిన వర్షం
జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షం

సూర్యాపేట, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బులతో మేఘావృతమై సాయంత్రం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తూనే ఉంది. జిల్లాలోని పలు మండలాల్లోని చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నా యి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షం వల్ల పంట పొలాలకు ఎలాంటినష్టం లేకపోయినప్పటికీ కూరగాయల సాగు చేసే రైతులకు నష్టం వాటిల్లు తోంది. జిల్లాలో ఏడువేల ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. ఆకు కూరలకు మచ్చలు వస్తున్నాయి. ఇంకా దోస, బీర, కాకరకాయలకు పూత రాలిపోతుంది. జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో అధిక మోతాదులో వర్షం కురిసింది. అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా సూర్యాపేటలో 27.3 మిల్లీమీటర్ల వర్షం కురవగా, చివ్వెంలలో 11 మి.మీ, నాగారంలో 3 మి.మీ వర్షపాతం నమోదవ్వగా అత్యల్పంగా హుజూర్‌నగర్‌లో 0.8 వర్షపాతం నమోదైంది.  జిల్లాకేంద్రంలో గురువారంరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వీధులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాం తాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విధుల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి జిల్లాకేంద్రంలో మబ్బులతో కూడిన వాతావరణం ఉండడంతో పట్టణ వాసులు కొద్దిరోజులుగా ఉన్న వేడి నుంచి ఉపశమనం పొందారు.  

Updated Date - 2021-08-27T06:15:52+05:30 IST