వర్షానికి కూలిన ఇల్లు

ABN , First Publish Date - 2021-07-24T07:03:51+05:30 IST

వరుసగా కురుస్తున్న వర్షాలకు అడ్డ గూడూరు మండలం డి.రేపాక గ్రామంలో చిప్పలపల్లి నాగమ్మకు చెందిన రేకుల ఇల్లు శుక్రవారం కూలింది.

వర్షానికి కూలిన ఇల్లు
మోత్కూరులో దెబ్బతిన్న రోడ్డు

మోత్కూరు, జూలై 23: వరుసగా కురుస్తున్న వర్షాలకు అడ్డ గూడూరు మండలం డి.రేపాక గ్రామంలో చిప్పలపల్లి నాగమ్మకు చెందిన రేకుల ఇల్లు శుక్రవారం కూలింది. మోత్కూ రు–నార్కట్‌పల్లి రోడ్డు పొడిచేడు వద్ద, అడ్డ గూడూరు మండలం చౌళ్లరామారం, చిర్రగూ డూరు రోడ్డు ధ్వంసమైనదున వాహన చోద కులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

గుండాల/ఆలేరు:  వర్షాలకు గుండాల చౌర స్తాలో  చెట్టు వేర్లతో సహా కూలి కరెంట్‌ తీగల మీద పడి, తీగలతో పాటు గుడిసె హోటల్‌పై పడింది. దీంతో గడిసె కూలింది. చె కరెంట్‌ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. వరదలతో వాగులు, పొంగు తున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు.  Updated Date - 2021-07-24T07:03:51+05:30 IST