‘పోడు’ రైతులకు పట్టాలు మంజూరు చేయాలి
ABN , First Publish Date - 2021-11-26T06:32:25+05:30 IST
పోడు భూము లు సాగు చేసుకుంటున్నా రైతులకు వెంటనే ప ట్టాలు మంజూరీ చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దామరచర్ల, నవంబరు 25: పోడు భూము లు సాగు చేసుకుంటున్నా రైతులకు వెంటనే పట్టాలు మంజూరీ చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అడవిదేవులపల్లి మండల కేంద్రంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా రైతులు పోడు భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ పట్టాలు మంజూరు చేయడం లో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, బ్యాంకు రుణాలు పోడు భూములకు కల్పించకపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా సమస్యలపై సీపీఎం నిరంతరం పొరా టం చేస్తోందన్నారు. సమావేశంలో మండల జిల్లా కమిటీ సభ్యుడు రవినాయక్, మండల కన్వీనర్ బాలసైదులు, కో కన్వీనర్ కొర్రసైదానాయక్, సైదులు పాల్గొన్నారు.