ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-12-28T06:10:53+05:30 IST

ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం. విజయకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి 86 ఫిర్యాదులు స్వీకరించారు. రెవెన్యూ, భూ సమస్యలకు సంబంధించినవి 62, పింఛన్‌, మునిసిపల్‌, రేషన్‌ కార్డుల కు సంబంధించిన 24 ఫిర్యాదులను గుర్తించారు. ప్రజావాణిలో

ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణిలో దరఖాస్తులు అందజేసేందుకు క్యూకట్టిన ప్రజలు

భువనగిరి రూరల్‌, డిసెంబరు 27: ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం. విజయకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి 86 ఫిర్యాదులు స్వీకరించారు. రెవెన్యూ, భూ సమస్యలకు సంబంధించినవి 62, పింఛన్‌, మునిసిపల్‌, రేషన్‌ కార్డుల కు సంబంధించిన 24 ఫిర్యాదులను గుర్తించారు. ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఆయా శాఖల అధికారులకు సమాచారం ఇచ్చినట్లు కలెక్టరేట్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ వై.మల్లికార్జున్‌ తెలిపారు.

Updated Date - 2021-12-28T06:10:53+05:30 IST