విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి : డీఈవో
ABN , First Publish Date - 2021-11-28T05:49:01+05:30 IST
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి కానుగల నర్సింహ అన్నారు. బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంప్లెక్స్ సమావేశాల్లో తెలుసుకున్న విషయాలను విద్యార్థులకు చెప్పాలని సూ

తుర్కపల్లి, నవంబరు 27: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి కానుగల నర్సింహ అన్నారు. బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంప్లెక్స్ సమావేశాల్లో తెలుసుకున్న విషయాలను విద్యార్థులకు చెప్పాలని సూచించారు. తక్కువ సమయంలోనే విద్యార్థులకు సెలబస్ పూర్తి చేసి పదో తరగతి పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. విద్యార్థులందరినీ పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని ఉపాధ్యాయులను కోరారు. సమావేశంలో ఎంఈవో కృష్ణ, ప్రధానోపాధ్యాయుడు పి శేషగిరిరావు, ఉపాధ్యాయులు బల్ల ఉపేందర్‌రావు, ఫైళ్ళ కరుణాకర్‌రెడ్డి, బిక్షమయ్య ఉన్నారు.