లాభదాయకమైన పంటలు సాగు చేయాలి

ABN , First Publish Date - 2021-10-31T06:28:52+05:30 IST

రైతులు అధిక లాభాలు ఇచ్చే పంటలను సాగు చేసుకోవాలని జడ్పీ చైర్మన సందీ్‌పరెడ్డి అన్నా రు.

లాభదాయకమైన పంటలు సాగు చేయాలి
నర్సయ్యగూడెంలో బంతిపూల తోటను పరిశీలిస్తున్న జడ్పీ చైర్మన సందీ్‌పరెడ్డి

జడ్పీ చైర్మన సందీ్‌పరెడ్డి 

 వలిగొండ, అక్టోబరు 30: రైతులు అధిక లాభాలు ఇచ్చే పంటలను సాగు చేసుకోవాలని జడ్పీ చైర్మన సందీ్‌పరెడ్డి అన్నా రు. శనివారం మండలంలోని నర్సయ్యగూడెం గ్రామంలో రైతు చంద్రశేఖర్‌రావు వ్యవసాయ క్షే త్రాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బొప్పాయి, మునగ, టమాటా, బంతి సాగులో రైతు తీసుకుంటున్న యాజమాన్య పద్ధతులు, ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమే్‌షరాజు, సర్పంచ తుమ్మల దామోదర్‌, నాయకులు అనంతరెడ్డి, రమేష్‌, ఏవో అంజనీదేవి, ఏఈవోలు ప్రసన్న, నవిత, శ్రుతి, స్వప్న, వెంకటేష్‌, సాయి, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-10-31T06:28:52+05:30 IST