విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-11-26T05:55:53+05:30 IST
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రం లో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. దీర్ఘకాలిక సమస్యలైన ఆర్టీజన్ ఉద్యోగుల పదోన్నతులు కల్పించాలని, పని భారం తగ్గించేలా ఖాళీగాఉన్న పోస్టులలు భర్తీ చేయాలని డిమాండ్ చేశా రు.

సూర్యాపేటటౌన్, నవంబరు 25: విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రం లో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. దీర్ఘకాలిక సమస్యలైన ఆర్టీజన్ ఉద్యోగుల పదోన్నతులు కల్పించాలని, పని భారం తగ్గించేలా ఖాళీగాఉన్న పోస్టులలు భర్తీ చేయాలని డిమాండ్ చేశా రు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టం 2020 వ్యతిరేకిస్తూ చేపట్టే సార్వత్రిక సమ్మెకు సమాయత్తం కావాలన్నారు. అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడుగా వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా సాయిబాబా, కార్యనిర్వహక అధ్యక్షుడిగా సుఽధీర్, గౌరవ కార్యదర్శులుగా శంకర్, వరప్రసాద్, జనార్దన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో వెంకన్న, యాదగిరినాయుడు, వేణు, భాస్కర్, సయ్యద్‌మియా, రాంరెడ్డి, గోపాల్, యాదగిరి, అమర్‌నాథ్, వెంకటయ్య, చినస్వామి, బాలకృష్ణ పాల్గొన్నారు.