అర్చకులకు కనీస వేతనం 12వేలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-12-31T16:36:39+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా పలు దేవాలయాల్లో అర్చకత్వం చేస్తున్న ఽధూపదీప నైవేద్యం పథకం అర్చకులకు కనీస వేతనం 12వేలు ఇవ్వాలని,..

అర్చకులకు కనీస వేతనం 12వేలు ఇవ్వాలి

నల్లగొండ కల్చరల్‌, డిసెంబరు 30: రాష్ట్రవ్యాప్తంగా పలు దేవాలయాల్లో అర్చకత్వం చేస్తున్న ధూపదీప నైవేద్యం పథకం అర్చకులకు కనీస వేతనం 12వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్‌ వాసుదేవశర్మ, జిల్లా నాయకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, గుదే లక్ష్మీనర్సయ్యశర్మలు కోరారు. సీఎంకు లక్ష పో స్ట్‌ కార్డుల ద్వారా వినతి కార్యక్రమంలో భాగంగా పోస్ట్‌ కా ర్డును డబ్బాలో వేసే కార్యక్రమాన్ని శుక్రవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అర్చక కుటుంబాలు పూర్తి చేసిన పోస్ట్‌ కార్డులను రాష్ట్ర వ్యాప్తంగా సీఎంకు చేరే విధంగా పోస్ట్‌ డబ్బాలో వేశారని అన్నారు. 

Updated Date - 2021-12-31T16:36:39+05:30 IST