ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2021-10-21T06:46:40+05:30 IST
గతంలో కరోనా ప్రభావంతో వాయి దాపడిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను ఈ నెల 25 నుంచి నవంబరు 2వ తేదీ వరకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఇంటర్ నోడల్ అధికారి బి.సంజీవ పరీక్షల సన్నాహ క సమావేశాన్ని నిర్వహించారు.

పకడ్బందీ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ
44 పరీక్షా కేంద్రాలు, 7,523 మంది విద్యార్థులు
ఈ నెల 25 నుంచి నవంబరు 2వ తేదీ వరకు పరీక్షలు
భువనగిరి టౌన్, అక్టోబరు 20: గతంలో కరోనా ప్రభావంతో వాయి దాపడిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను ఈ నెల 25 నుంచి నవంబరు 2వ తేదీ వరకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఇంటర్ నోడల్ అధికారి బి.సంజీవ పరీక్షల సన్నాహ క సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని 65 ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్ కళాశాలలకు చెందిన 5,806 మంది జనరల్ ఇంటర్ విద్యార్థులు, 1,717 మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి 7,523 మంది హాజరుకానున్నారు. ఇం దుకోసం జిల్లాలో 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా నిబంధన ల నడుమ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష లు కొనసాగనున్నాయి. పరీక్షలలో మాస్‌కాపీయింగ్ నియంత్రణకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన లెక్చరర్లను ఇన్విజిలేటర్లుగా నియమించారు. అవసరమైతే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఎస్జీటీ టీచర్లకు ఇన్విజిలేషన్ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈమేరకు జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీకి లేఖ రాసినట్లు నోడల్ అధికారి తెలిపారు. సమావేశంలో 44 మంది చీఫ్ కస్టోడియన్లు, 44 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 9 మంది పేపర్ కస్టోడియన్లు, తదితర అధికారులు పాల్గొన్నారు.