రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేత
ABN , First Publish Date - 2021-05-05T07:54:06+05:30 IST
విద్యుత్ బిల్లులు చెల్లించడంలేదని మండలంలోని అలింగాపురం ఎస్సీ కాలనీలో అధికారులు రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివే యడంతో కాలనీవాసులు ఆగ్రహించారు. పాలకవీడు సబ్‌స్టేషన్‌ను మంగళవారం కాలనీవాసులు ముట్టడించారు.

పాలకవీడు సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన గ్రామస్థులు
పాలకవీడు, మే 4: ఈ సందర్భంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాను నిలిపివేసినందున కొవిడ్ రోడులు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీలు విద్యుత్ బిల్లులు చెల్లించే అవసరంలేదని ప్రచారం చేసి ఇప్పుడు విద్యుత్‌ను నిలిపివేయడం తగదన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ ఐజాక్ మాట్లాడుతూ ఎస్సీ కాలనీల్లో ప్రతి మీటరు మీద 100 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను వినియోగించుకోవచ్చని, 100 యూనిట్లు దాటిన వినియోగదారులు బిల్లులు చెల్లించాలని ఉత్తర్వులు ఉన్నాయన్నారు. పరిమితి యూనిట్లు దాటిన వినియోగదారులు బిల్లులు చెల్లించాలని కోరుతున్నామన్నారు.