ప్రాధాన్యం ప్రకారమే పోస్టింగ్‌లు

ABN , First Publish Date - 2021-12-26T05:33:22+05:30 IST

జిల్లాలో ఉద్యోగులకు ప్రాధాన్యం ప్రకారమే పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు.

ప్రాధాన్యం ప్రకారమే పోస్టింగ్‌లు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి 

సూర్యాపేట(కలెక్టరేట్‌), డిసెంబరు 25: జిల్లాలో ఉద్యోగులకు ప్రాధాన్యం ప్రకారమే పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వశాఖలో లోకల్‌ క్యాడర్‌ కేటాయింపు ప్రక్రియ సజావుగా నిర్వహించాలన్నారు. జిల్లాస్థాయి లోకల్‌ క్యాడర్‌ పోస్టులపై అధికారులు స్పష్టమైన వివరాలు అందించాలని సూచించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బందికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఖాళీలు చూపించి సీనియార్టీ ప్రకారం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అన్ని శాఖల అధికారులతోపాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను వివరించాలన్నారు. ప్రాధాన్యం ప్రకారమే పోస్టింగ్‌లు ఉంటాయన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, ఏవో శ్రీదేవి, పులి సైదులు, సుదర్శన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-26T05:33:22+05:30 IST