ధాన్యం కొనుగోలు చేయకుండా రాజకీయాలా?
ABN , First Publish Date - 2021-11-21T05:54:08+05:30 IST
రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వా లు రాజకీయ చేస్తున్నాయని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు. కల్లాల్లోకి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం రెండో రోజు ఆత్మకూర్(ఎస్), నెమ్మికల్ గ్రామాల్లో ఐకేపీ సెంటర్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగో

ఆత్మకూర్(ఎస్)/ఆత్మకూర్(ఎస్)/ అనంతగిరి/ మఠంపల్లి, నవంబరు 20: రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా బీజేపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వా లు రాజకీయ చేస్తున్నాయని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు. కల్లాల్లోకి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం రెండో రోజు ఆత్మకూర్(ఎస్), నెమ్మికల్ గ్రామాల్లో ఐకేపీ సెంటర్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 15రోజుల్లో ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలల్లో డబ్బులు జమ చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గోదల రంగారెడ్డి, రఫీ, చిలముల గోపాల్‌రెడ్డి, గునగంటి మల్సూర్ పాల్గొన్నారు. ఆత్మకూర్(ఎస్)లో జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దండా వెంకట్‌రెడ్డి మాట్లాడారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో నాయకులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సోమిరెడ్డి, దామోదర్‌రెడ్డి, దండా శ్రీనివాస్‌రెడ్డి, బెల్లంకొండ చక్రయ్య, తండ చంద్రయ్య, యాతాకుల మల్లయ్య, గంపల ఎల్లయ్య పాల్గొన్నారు. అనంతగిరిలో బీజేపీ నాయకులు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు కనగాల నారాయణ, బొలిశెట్టి క్రిష్ణయ్య, ఏలేటి వెంకటేశ్వర్‌రెడ్డి, సతీష్, లింగయ్య పాల్గొన్నారు. మఠంపల్లిలో జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు భూక్య పాండునాయక్ మాట్లాడారు. ప్రభుత్వాలు స్పందించి రై తు పండించిన పంటకు మద్దతు ధర కల్పిం చాలన్నారు. కార్యక్రమంలో సీసీఎం మండల కార్యదర్శి మాలోతు బాలునాయక్, కోటయ్య, వెంకటేశ్వర్లు, వినోద్ నా యక్, లాల్యనాయక్, వాలిబాయి, శ్రీను, సకృనాయక్, నాగునాయక్ పాల్గొన్నారు.