ఎన్నికల సమయంలోనే రాజకీయాలు : ఎమ్మెల్యే సైదిరెడ్డి

ABN , First Publish Date - 2021-06-21T05:49:51+05:30 IST

రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలని, ఆ తర్వాత సమయాన్ని అభివృద్ధికి కేటాయించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు : ఎమ్మెల్యే సైదిరెడ్డి
నేరేడుచర్లలో వాటర్‌ప్లాంటును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

నేరేడుచర్ల, జూన్‌ 20 : రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలని, ఆ తర్వాత సమయాన్ని అభివృద్ధికి కేటాయించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. అంకిరెడ్డి ఫౌండేషన్‌ సౌజన్యంతో మునిసిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షురాలు చల్లా శ్రీలత, విజయభాస్కర్‌రెడ్డి దంపతులు రూ.5లక్షలు వెచ్చించి కమలానగర్‌లో నిర్మించిన వాటర్‌ప్లాంట్‌ను, శాంతినగర్‌లో నిరుపేద మహిళకు నిర్మించిన ఒక గదిని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది అభివృద్ధిని అడ్డుకోవడం కోసం కోర్టులో కేసులు వేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాలు చేయకుండా అభివృద్ధిలో పోటీపడాలని పిలుపునిచ్చారు. నేరేడుచర్ల మునిసిపాలిటీకి మంజూరైన రూ.15 కోట్ల నిధులకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ చందమళ్ల జయబాబు, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, మార్కెట్‌ చైర్మన్లు ఇంజమూరి యశోదరాములు, కడియం వెంకటరెడ్డి, తాళ్లూరి లక్ష్మినారాయణ, గుర్రం మార్కండేయ, సాయి, నాగవేణి, అనంతు శ్రీను, కొణతం సత్యనారాయణరెడ్డి, శ్రీధర్‌, సుందరయ్య, శ్రీను, నారాయణ, చంటి, నవీన్‌, వెంకటరెడ్డి, రాజేష్‌, ఉదయ్‌, చంద్రయ్య పాల్గొన్నారు. 

మేళ్లచెర్వు: మండల కేంద్రంలో జడ్పీ నిధులు రూ.5లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పందిళ్లపల్లి శంకర్‌రెడ్డి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఇమ్రాన్‌, వార్డు సభ్యుడు సురేష్‌., రాజా, సర్వయ్య, సాంబయ్య, బాలవెంకటరెడ్డి, కొండారెడ్డి, వెంకట్రావు, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T05:49:51+05:30 IST