జాతీయస్థాయి యోగా పోటీలకు పేట వాసి
ABN , First Publish Date - 2021-10-05T06:05:17+05:30 IST
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఈ నెల 27వ తేదీన జరిగే జాతీయస్థాయి యోగా పోటీలకు జిల్లా కేంద్రానికి చెందిన గూడూరు నాగేశ్వర్‌రావు ఎంపికయ్యారు.
సూర్యాపేట అర్బన్, అక్టోబరు 4 : ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఈ నెల 27వ తేదీన జరిగే జాతీయస్థాయి యోగా పోటీలకు జిల్లా కేంద్రానికి చెందిన గూడూరు నాగేశ్వర్‌రావు ఎంపికయ్యారు. ఈ నెల 4న కరీంనగర్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ప్రథమస్థానంలో నిలిచి అవార్డు అందుకున్నారు. యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో లక్నోలో జరిగే జాతీయస్థాయి యోగా పోటీల్లో ఆయన పాల్గొననున్నారు.