కేసీఆర్‌ మాటలను ప్రజలు నమ్మరు

ABN , First Publish Date - 2021-12-19T05:53:54+05:30 IST

సీఎం కేసీఆర్‌ మాటలను ప్రజలు నమ్మేరోజులు పోయాయని మాజీ ఎంపీపీ జితేందర్‌ర్‌రెడ్డి అన్నారు.

కేసీఆర్‌ మాటలను ప్రజలు నమ్మరు
ముగింపు సమావేశంలో మాట్లాడుతున్న జితేందర్‌రెడ్డి

మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి

కనగల్‌, డిసెంబరు 18: సీఎం కేసీఆర్‌ మాటలను ప్రజలు నమ్మేరోజులు పోయాయని మాజీ ఎంపీపీ జితేందర్‌ర్‌రెడ్డి అన్నారు. మండలంలోని చర్లగౌరారం పంచాయతీ శ్రీరామానందతీర్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో మూడు రోజులపాటు కొనసాగిన శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలైన డబుల్‌బెడ్‌రూం, ఇంటికి ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి వంటి వాటిని సీఎం తుంగలో తొక్కారన్నారు. ఉపఎన్నికలో ఓట్లను సాధించేందుకు ఆగమేఘాల మీద తీసుకొచ్చిన దళితబంధును సైతం అటకెక్కించారన్నారు. కేసీఆర్‌ మాయమాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. రైతులు, నిరుద్యోగులు అన్ని వర్గాల ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు. బీజేపీని బూత్‌స్థాయిలో బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దుబ్బాక, హుజూరాబాద్‌ ఫలితాలే పునరావృత్తం అవుతాయన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, బంగారు శృతి, ఆర్‌.ప్రదీ్‌పకుమార్‌, వీరెళ్లి చంద్రశేఖర్‌, రాజశేఖర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, యాదగిరిచారి, ముత్యాలచారి, రవిగౌడ్‌, సిద్దు, ఏలేంద్ర, కిషన్‌, నవీన్‌రెడ్డి, శ్యాం, మల్లికార్జున్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-19T05:53:54+05:30 IST