పెండింగ్‌ పనులు సత్వరమే పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-11-28T06:00:12+05:30 IST

జిల్లా వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి సంబంధిత అఽధికారులను ఆదేశించారు.

పెండింగ్‌ పనులు సత్వరమే పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), నవంబరు 27: జిల్లా వివిధ పథకాల ద్వారా చేపట్టిన పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి సంబంధిత అఽధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌, జిల్లా అధికారులతో శనివారం నిర్వహించి న సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. సీడీపీ, సీడీఎఫ్‌, సీబీఎఫ్‌, డీఎంఎ్‌ఫటీ నిధుల ద్వారా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవని, ఆ పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో వివిధ పనులకు నిధులు కేటాయించి, అనుమతులు ఇచ్చినప్పటికీ సకాలంలో పనులు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సమస్యలు ఉంటే సంబంధిత శాఖ అధికారులు, తహసీల్దార్ల ద్వారా  వెంటనే పరిష్కరించుకొని పనులు పూర్తి చేయాలన్నారు. పీఆర్‌ ఏఈలు చేపట్టిన పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో సీపీవో వెంకటేశ్వర్లు, ఆర్‌అండ్‌బీ ఈఈ యాకుబ్‌, పీఆర్‌ ఈఈ శ్రీనివా్‌సరెడ్డి,విద్యుత్‌ ఏడీ ఉదయ్‌భాస్కర్‌,అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-28T06:00:12+05:30 IST