పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

ABN , First Publish Date - 2021-12-31T16:31:53+05:30 IST

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చే యాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది.

పెండింగ్‌  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

నల్లగొండ క్రైం, మిర్యాలగూడ, డిసెంబరు 30: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చే యాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. జిల్లా కేంద్రం లో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్థన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థలను బంద్‌ చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రా ష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న 14లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని డి మాండ్‌ చేశారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా విద్యా సంస్థల బంద్‌ నిర్వహించామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వి ద్యార్థుల ఉన్నతి కోసం ఆలోచించాలన్నారు.


కార్యక్రమంలో నాయకులు మునాస ప్రసన్న కుమార్‌, కన్నెబోయిన రాజు, పొగాకు రవికుమార్‌, యాదగిరి, హారికృష్ణ, సతీష్‌, కృష్ణమూర్తి, నరేంద్రకుమార్‌, సురేష్‌, మహేష్‌, రమ్య పాల్గొన్నారు. మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. వెంటనే పెండింగ్‌ బిల్లులను చెల్లించాలన్నా రు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తిరుమలగిరి అశోక్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలగాని వెంకటేశం గౌడ్‌, నాగయ్య, సరిత, ప్రణతి, శిరీష, ఉమ, రాజేశ్వరి, సురేష్‌, వెంకన్న, పద్మ, సీత పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T16:31:53+05:30 IST