దిక్కుమాలిన ప్రభుత్వాలతో దిక్కుదోచని రైతన్నలు

ABN , First Publish Date - 2021-11-28T05:59:08+05:30 IST

దిక్కుమాలిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థతతో రైతులు దిక్కుదోచక, మనోవేదనతో ఉన్నారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు.

దిక్కుమాలిన ప్రభుత్వాలతో దిక్కుదోచని రైతన్నలు
అనంతారం పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా బస్తాలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

పెన్‌పహాడ్‌, నవంబరు 27: దిక్కుమాలిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థతతో రైతులు దిక్కుదోచక, మనోవేదనతో ఉన్నారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. ‘కల్లాలోకి కాంగ్రెస్‌’ కార్యక్రమంలో భాగంగా శనివారం పెన్‌పహాడ్‌ మండలం అనంతారం గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని సందర్శించి, రైతులతో మాట్లాడారు. రాష్ట్రంలో  తేమశా తం 17లోపు ఉండాలనే నిబంధనతో 20రోజుల నుంచి కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యానికి కాంటాలు వేయడంలేదన్నారు. వర్షం వచ్చి రాశులు తడిసి, ధాన్యం నల్లగామారి, మొలకెత్తడంతో వాటిని నిర్వాహకులు కొనుగోలు చేయడంలేదని, దీంతో రైతులు నష్టపోతున్నారన్నారు. వరి సాగు చేసిన రైతులు వేల రూపాయలు ఖర్చుచేసి, అధిక దిగుబ డి సాధించి, తీరా అమ్ముకుందామంటే ప్రభుత్వాలు కొనుగో లు చేయకుండా నిరాకరించడంతో రైతులు దిక్కుదోచని స్థితిలో ఉన్నారన్నారు. మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రైతులపక్షాన అందోళనకు దిగుతామన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వా లు అధికారం అడ్డుపెట్టుకోని రైతులతో  దోబూచులాడుతున్నాయన్నారు. రబీ పంట సాగుపై, కొనుగోలు విషయంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులకు ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందించడంలేదని అన్నారు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు రూ.3లక్షల ఆర్థికసాయం అం దజేస్తున్నారని, తెలంగాణ ప్రాంత రైతులపై ఎందుకు వివ క్ష చూపుతున్నారని ప్రశ్నించారు. అనంతరం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన కోణిదల లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమం లో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు తూముల సురేష్‌రావు, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కోన వెంకన్న, సూర్యాపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోతి గోపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షు డు తంగెళ్ల కరుణాకర్‌రెడ్డి, నాయకులు భూక్య సందీప్‌ రాథోడ్‌, భూక్య శివ నాయక్‌, గ్రామ ఉపసర్పంచ్‌ మామిడి మైసయ్య, మాజీ సర్పంచ్‌ షేక్‌ జానిమియా,జానయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-28T05:59:08+05:30 IST