పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-11-23T06:29:15+05:30 IST

మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వతో పాటు తరలించడానికి సిద్ధంగా ఉంచిన పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్‌వోటీ పోలీసులు తెలిపారు.

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

బొమ్మలరామారం, నవంబరు 22: మండలంలోని నాగినేనిపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వతో పాటు తరలించడానికి సిద్ధంగా ఉంచిన పీడీఎస్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్‌వోటీ పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే... పీడీఎస్‌ బియ్యాన్ని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచా రం మేరకు ఎస్వోటీ పోలీసులు నాగినేనిపల్లి గ్రామంలో మాలోతు శ్రీకాంత, పసునూరి ప్రకాశ ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో ఇంట్లో నిల్వ ఉంచిన పీడీఎస్‌ బియ్యంతో పాటు 25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం లోడ్‌తో ఉన్న టీఎస్‌ 15 యూఏ 7568 నెంబరు గల మహీంద్రా జీటో వాహనా న్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. శ్రీకాంత, ప్రకాశలను  అదుపులోకి తీసుకొని స్థానిక పోలీ్‌సస్టేషనలో అప్పగించినట్లు తెలిపారు. ఈ దా డుల్లో ఎస్‌వోటీ పోలీసులు మహేష్‌, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.  


Updated Date - 2021-11-23T06:29:15+05:30 IST