పన్ను చెల్లించండి.. బహుమతి పొందండి..

ABN , First Publish Date - 2021-12-20T05:29:41+05:30 IST

పన్ను చెల్లించండి.. బహుమతి పొందం డి.. ఇదేమిటీ పన్ను కట్టడం ఏమిటి... బహుమతి ఏంటని ఆలోచిస్తున్నారా... ఇలాంటివి ఎక్కువగా సూపర్‌ మార్కెట్లు, పెట్రోల్‌ బంకులు, వివిధ ప్రైవేటు ఆఫీసుల్లో ఇలాంటి పథకాలు చూసి ఉంటారు. కానీ గ్రామపంచాయతీల్లో ప న్ను నూరు శాతం వసూలు చేసేందుకు ఓ సర్పంచ వినూత్నంగా ఆలోచిం చారు.

పన్ను చెల్లించండి.. బహుమతి పొందండి..
అడ్డగుడూరు మండలం వెల్దేవి గ్రామంలో సర్పంచ ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీ

వెల్దేవి గ్రామంలో ఫ్లెక్సీల ఏర్పాటు  

ఇంటి పన్ను చెల్లించి గ్రామాభివృద్ధికి తోడ్పడండి 

సొంత డబ్బులతో బహుమతుల ప్రదానం 

అడ్డగుడూరు,డిసెంబరు 19: పన్ను చెల్లించండి.. బహుమతి పొందం డి.. ఇదేమిటీ పన్ను కట్టడం ఏమిటి... బహుమతి ఏంటని ఆలోచిస్తున్నారా... ఇలాంటివి ఎక్కువగా సూపర్‌ మార్కెట్లు, పెట్రోల్‌ బంకులు, వివిధ ప్రైవేటు ఆఫీసుల్లో ఇలాంటి పథకాలు చూసి ఉంటారు. కానీ గ్రామపంచాయతీల్లో ప న్ను నూరు శాతం వసూలు చేసేందుకు ఓ సర్పంచ వినూత్నంగా ఆలోచిం చారు. ఇంటి పన్ను కట్టండి అని గ్రామపంచాయతీ సిబ్బంది ఎన్నిసార్లు వి న్నవించినా కొందరు పన్ను కట్టడం లేదు. దీంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. అంతేకాక పన్నులు వంద శాతం వసూలు కాక ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు కూడా మండల అధికారులతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామంలో వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టారు. పన్ను చెల్లించండి.. బహుమతులు పొందండి అని ఫ్లెక్సీ అందరినీ ఆకర్షిస్తోంది. గ్రా మాల్లో ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేయాలని సర్పంచ, పంచాయతీ కార్యదర్శులపై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. ఇంటి పన్నులు వ సూలు చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేసినా ప్రతీ ఏడాది 50 నుంచి 70 శాతం మాత్రమే వసూలవుతున్నాయి. ఈ ఏడాది ఎలాగైనా వంద శాతం పన్నులు వసూలు చేయాలన్న లక్ష్యంతో అడ్డగుడూరు మండలంలోని వెల్దేవి గ్రామ సర్పంచ పిల్లి శ్రీకళ వినూత్నంగా ఆలోచించారు. 2021-22 ఆర్థిక సం వత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు 2022 జనవరి 25వ తేదీలోగా చెల్లించిన వారిలో ముగ్గురిని లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసి మూడు బ హుమతులు ఇస్తామని ప్రకటించారు. ప్రఽథమ బహుమతిగా రూ.5 వేల విలువైన ఎయిర్‌ కూలర్‌, ద్వితీయ బహుమతిగా రూ.3 వేల వి లువైన స్టాండ్‌ ఫ్యాన, తృతీయ బహుమతిగా రూ.2 వేల విలువైన రై స్‌ కుక్కర్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గ్రామ పంచాయతీ నిధుల నుంచి బహుమతులు ఇచ్చే అవకాశం లేనందున సర్పంచ తన సొంత డబ్బులతో ఈ బహుమతులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 1,10,000 వేలు బకాయిలు ఉన్నట్లు తెలిపారు. 2021 ఏప్రిల్‌ నుంచి 2022 జనవరి 25 తేదీ లోపు ఇంటిపన్ను చెల్లించిన వారి జాబితాను తయారు చేసి జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా లక్కీడ్రా ద్వారా తీయనున్నట్లు తెలిపారు. విజేతలకు బహుమతులు అందించనున్నట్లు సర్పంచ వివరించారు. ఈ మేరకు సంబంధిత ఫ్లెక్సీలు ము ద్రించి గ్రామ పంచాయితీ కార్యాలయం, మరో నాలుగు కూడళ్ల వద్ద ఏర్పాటు చేయించారు. ఆదివారం సర్పంచ విలేకరులతో మాట్లాడారు. కొద్ది మొత్తంలో ఉన్న ఇంటి పన్ను చెల్లిస్తే బాకీ తీరుతుంది. అదృష్టం బాగుంటే బహుమతి కూడా వస్తుందనే ఆలోచనతో ప్రజలు ఇంటి పన్ను చెల్లించడానికి ముందుకు వస్తారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వంద శాతం ఇంటి పన్ను వసూలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Updated Date - 2021-12-20T05:29:41+05:30 IST