‘పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇప్పించాలి’

ABN , First Publish Date - 2021-08-21T06:07:06+05:30 IST

తరతరాలుగా తమకు సంక్రమిస్తున్న భూములను కబ్జాదారులనుంచి కాపాడి తమకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇప్పించాలని నల్ల గొండ మునిసిపాలిటీ పరిధిలోని తాళ్లబావిగూడేనికి చెందిన దళితులు డిమాండ్‌ చేశారు.

‘పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇప్పించాలి’

నల్లగొండ టౌన్‌, ఆగస్టు 20: తరతరాలుగా తమకు సంక్రమిస్తున్న భూములను కబ్జాదారులనుంచి కాపాడి తమకు పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇప్పించాలని నల్ల గొండ మునిసిపాలిటీ పరిధిలోని తాళ్లబావిగూడేనికి చెందిన దళితులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు  కలెక్ట రేట్‌ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈసం దర్భంగా పలువురు మాట్లాడుతూ మండల పరిధిలోని అమ్మగూడెం శివారులో గల సర్వేనెం.98,99లలో దాదాపు 12 ఎకరాల వ్యవసాయ భూమి తమకు అను వంశికంగా సంక్రమిస్తోందన్నారు. ఈభూముల్లో సేద్యం చేసుకుంటూ ఇంతకాలం కుటుంబాలను పోషించుకుం టున్నామని, అయితే ఇటీవల కొందరు అక్రమార్కులు తమ భూమిపై కన్నేసి తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కొందరు అధికారులతో కుమ్మక్కై తప్పుడు పత్రాలను సృష్టించి తమను సేద్యం చేసుకోకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. తక్షణమే దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి తగిన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బి.జాన య్య, మేడిలింగయ్య, గాదె మాదయ్య, కృష్ణయ్య, శంకర్‌, అశోక్‌, పద్మ, ఎల్లమ్మ, సత్తమ్మ పాల్గొన్నారు.  

Updated Date - 2021-08-21T06:07:06+05:30 IST