మంత్రి ఈటలపై కక్ష సాధింపు చర్యలు

ABN , First Publish Date - 2021-05-02T06:56:09+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడ లపై గొంతెత్తున్నాడని మంత్రి ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్‌ కక్ష్య సాధింపు చర్యలు అప్రజాస్వామికమని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఖండించారు.

మంత్రి ఈటలపై కక్ష సాధింపు చర్యలు
మక్తానంతారంలో పార్టీ దిమ్మెను కూల్చిన టీఆర్‌ఎస్‌ నాయకులు

డీసీసీ అధ్యక్షుడు కుంబం అనిల్‌కుమార్‌రెడ్డి

యాదాద్రి, మే1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడ లపై గొంతెత్తున్నాడని మంత్రి ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్‌ కక్ష్య సాధింపు చర్యలు అప్రజాస్వామికమని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఖండించారు. బడుగు, బలహీన వర్గాల నాయకుడిగా ఎదుగుతున్నందుకే పఽథకం ప్రకారం అతడిపై భూ కబ్జా అక్రమ ఫిర్యాదులతో విచారణ చేపట్టడం, మంత్రిత్వశాఖను బదలాయించడం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నార న్నారు. కనీసం ఆయన వాదనలను వినిపించే అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న అప్రజాస్వామిక అణిచివేత విధానాలపై తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

 టీఆర్‌ఎస్‌ పార్టీ దిమ్మె కూల్చివేత 

 బీబీనగర్‌: ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను తొలగించడం పట్ల ఆయన అభిమానుల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతు న్నాయి.  బీబీనగర్‌ మండలం మక్తానంతారం గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు శ్రీరాం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గ్రామంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ దిమ్మెను కూల్చివేసి నిరసన వ్యక్తం చేశారు. కాగా మంత్రివర్గం నుంచి తప్పించేందుకే ఈటలపై అసైన్స్డ్‌ భూముల కబ్జా చేశారనే ప్రచారానికి తెరలే పారని బీజేపీ జిల్లా నాయకులు పిట్టల అశోక్‌ శనివారం ఓ పత్రి కా ప్రకటనలో ఆరోపిం చారు. తనపై వచ్చిన భూ కబ్జాపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిం చాలని ఈటల డిమాండ్‌ను బీజేపీ స్వాగతిస్తుందన్నారు.  

 మోత్కూరు : టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం, తెలంగాణ మలిదశ ఉద్య మం మొదలైన నాటి నుంచి సీఎం కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్న బడు గు, బలహీన వర్గాల బిడ్డ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై తప్పు డు ఆరోపణలు చేయించి అతని శాఖను తొలగించడం అన్యాయమని బీసీ రిజర్వేషన్‌ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌ ఖండించారు. శనివారం ఆయన మోత్కూరులో విలేకరులతో మాట్లాడారు.    

 అడ్డగూడూరు : బీసీ నేత ఈటల రాజేందర్‌పై ఆసత్య ఆరోపణలు చేయడం సీగ్గు చేటని ఓయూ జేఏసీ నాయకుడు బాలెంల బాబు మహజన్‌ అన్నారు. శనివారం మండలకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల ఆస్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సీబీఐతో బిచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-05-02T06:56:09+05:30 IST