తీన్మార్‌ మల్లన్న అరెస్టుకు నిరసనగా పాదయాత్ర

ABN , First Publish Date - 2021-09-02T07:28:15+05:30 IST

తీన్మార్‌ మల్లన్న అరెస్టుకు నిరసనగా ఆయన అభి మానులు కోదాడ నుంచి హైదరాబాదులోని అమరవీరుల స్తూపం వరకు బుధవారం పాదయాత్ర చేశారు.

తీన్మార్‌ మల్లన్న అరెస్టుకు నిరసనగా పాదయాత్ర

కోదాడ టౌన్‌, సెప్టెంబరు 1: తీన్మార్‌ మల్లన్న అరెస్టుకు నిరసనగా ఆయన అభి మానులు కోదాడ నుంచి హైదరాబాదులోని అమరవీరుల స్తూపం వరకు బుధవారం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మల్లన్న టీం జిల్లా కన్వీనర్‌ కుంభం శ్రీనివాస్‌  మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్ని అరెస్టులు చేసినా మల్లన్న త్వరలో నిర్వహించే పాదయాత్రను ఎవరూ ఆపలేరన్నారు. కార్యక్రమంలో రాంబాబు, శ్రీకాంత్‌రెడ్డి, రఘు, గోపీ, తిరమలేష్‌, సతీష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-02T07:28:15+05:30 IST