ప్యాకింగ్‌ ఆహార పదార్థాలతో హాని

ABN , First Publish Date - 2021-10-28T05:35:23+05:30 IST

ప్యాకింగ్‌ ఆహార పదార్థాలతో చిన్న పిల్లల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికా్‌సభాటియా అన్నారు.

ప్యాకింగ్‌ ఆహార పదార్థాలతో హాని
ఎయిమ్స్‌లో వెబినార్‌లో మాట్లాడుతున్న ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌భాటియా

 చిన్నపిల్లలు వాటికి దూరంగా ఉండాలి   

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికా్‌సభాటియా 

బీబీనగర్‌, అక్టోబరు 27:ప్యాకింగ్‌ ఆహార పదార్థాలతో చిన్న పిల్లల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికా్‌సభాటియా అన్నారు. ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ రిషికే్‌షతో కలిసి సంయుక్తంగా ‘ఫ్రంట్‌ ఆఫ్‌ ప్యాకేజీ లేబులింగ్‌-పిల్లల ఆరోగ్యంపై ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో అత్యధిక పిల్లలకు పౌష్టికాహారం అందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో మధుమేహం, క్యాన్సర్‌, గుండె, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధుల కారణంగా ఏడాదికి 5.8మిలియన్ల మంది పిల్లలు మృతి చెందుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో 2015 నివేదిక చెబుతుందన్నారు. అధిక శరీర బరువుకు దారితీసే అదనపు కేలరీలు కలిగిన ఆహారం ఎక్కువగా తీసుకోవడంవల్ల జబ్బులకు గురవుతున్నారని చెప్పారు. ఎక్కువ కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగిన ఆహార పదార్థాలు ఎక్కువగా హాని చేస్తున్నాయన్నారు. 2016 సీఎన్‌ఎన్‌ సర్వే ప్రకారం అత్యంత ప్రాసెస్‌ చేయబడిన ఆహార ఉత్పత్తుల వల్ల పిల్లలతోపాటు యుక్త వయస్సు వారు అనారోగ్యం బారిన పడుతున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ప్యాకింగ్‌ ఆహారం తీసుకోవడంవల్ల ఊబకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు వస్తాయన్నారు. అలాంటి ఆహార పదార్థాలకు చిన్నపిల్లలు దూరంగా ఉండాలని సూచించారు. హానిచేసే ఆహార పదార్థాలను విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. ఎన్‌ఐఎన్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎన్‌.అర్లప్ప, సెయింట్‌ జాన్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌లు పలు అంశాలను వివరించారు.  

Updated Date - 2021-10-28T05:35:23+05:30 IST