కష్టకాలంలో బాధితులకు అండగా

ABN , First Publish Date - 2021-05-17T06:10:34+05:30 IST

కన్న ఊరిని కరోనా కబలిస్తున్న వేళ గ్రామానికి చెందిన యువకులు సొంత ఖర్చులతో ఆదివారం వైద్యశిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

కష్టకాలంలో బాధితులకు అండగా
కేతేపల్లి : బొప్పారంలో నిత్యావసర వస్తువులు అందిస్తున్న హనోక్‌

 తిరుమలగిరి(సాగర్‌), మే 16: కన్న ఊరిని కరోనా కబలిస్తున్న వేళ గ్రామానికి చెందిన యువకులు సొంత ఖర్చులతో ఆదివారం వైద్యశిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు. స్థానిక జడ్పీహెచఎ్‌సలో సుమా రు 85మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11మందికి పాజిటివ్‌ వచ్చి ంది. పాజిటివ్‌ వచ్చిన బాధితులకు ఉచితంగా మెడికల్‌ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ శాగం శ్రవనకుమార్‌రెడ్డి క్యాంపు ఏర్పాటు చేసిన తాతనబోయిన నరేష్‌,  శ్రవనకుమార్‌, నరేష్‌, బండి నవీన, రవిచారిని అభినందించారు.
కేతేపల్లి : నకిరేకల్‌ క్రీస్తు సంఘం ఛారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షుడు ఆదిమళ్ల హనోక్‌ మండలంలోని బొప్పారం గ్రామంలో ఇటీవల కరోనాతో మృతిచెందిన కుంభం కేశవులు కుటుంబానికి బియ్యం, నిత్యావసర వస్తువులు, పండ్లు, మాస్కులు, శానిటైజర్లు అందించారు. అదేవిధంగా బీమారం సర్పంచ్‌ బడుగుల శ్రీనివాసయాదవ్‌ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రామంలో కరోనాతో హోంక్వారంటైన్‌లో ఉన్న 25మందికి పండ్లు, గుడ్లు, నిత్యావసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు.
వేములపల్లి :  మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో  ఏర్పాటుచేసిన ఐసోలేషన కేంద్రంలో చికిత్స పొందుతున్న వారికి సర్పంచ చిర్ర మ ల్లయ్యయాదవ్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగి నారాయణవెంకట్‌రెడ్డి అల్పాహారం, రెండు పూటల భోజనంతోపాటు డ్రైఫ్రూట్స్‌, పండ్లు పంపిణీ చేశారు. మండలంలోని మొల్కపట్నం గ్రామంలో ఐసోలేషన కేంద్రంలోని  బాధితులకు జొన్నలగడ్డ శ్రీనివా్‌సరెడ్డి వంట సామగ్రి అందించారు.
మిర్యాలగూడ టౌన : కొవిడ్‌ బాధితులకు సేవలందించాలని బంజారా మహిళా ఎన్జీవో సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఆనంద్‌ పిలుపునిచ్చారు. మేము సైతం సంస్థతో కలిసి ఆదివారం ఆయన పట్టణ పరిధిలోని హోం ఐసోలేషనలో ఉన్న బాధితులకు  పండ్లు, డ్రైఫ్రూట్స్‌ పంపిణీ చేశారు.
 మర్రిగూడ : కరోనా సోకి తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న నామాపురం వీఆర్‌ఏ భీమనపల్లి రేణయ్యకు దేవరకొండ ఆర్డీవో గోపిరాం, మర్రిగూడ రెవెన్యూ అధికారులు ఆదివారం ఆర్థిక సాయం అందించారు. చికిత్సకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని వారు రూ.1.20లక్షలు సమకూర్చి రేణయ్య కుటుంబసభ్యులకు అందించారు.
రామగిరి : శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని వివేకనందనగర్‌ కాలనీలోని కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ సేవాసమితి నిర్వాహకులు నల్లమోతు రమేష్‌, మొరిశెష్టి నాగేశ్వర్‌రావు, ఆవుల వేణు మాట్లాడుతూ ఎనఆర్‌ఐ మిత్రమండలి సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు.

Updated Date - 2021-05-17T06:10:34+05:30 IST