ఆరుతడి పంటలే సాగు చేయాలి

ABN , First Publish Date - 2021-12-10T05:26:38+05:30 IST

యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు.

ఆరుతడి పంటలే సాగు చేయాలి
నూతనకల్‌లో ఆరుతడి పంట సాగుపై అవగాహన సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌

 కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

నూతనకల్‌ / మద్దిరాల, డిసెంబరు 9 : యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. నూతనకల్‌ మండల కేంద్రంతో పాటు మద్దిరాల మండలం గోరెంట్ల గ్రామంలో యాసంగి సీజన్‌లో పంట మార్పిడి విధానంపై రైతులకు గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అధిక దిగుబడి వచ్చే పంటలను సాగు చేస్తే లాభాలు ఆర్జిస్తారని తెలిపారు. యాసంగిలో నువ్వులు, మినుములు, వేరుశనగ పంటలను సాగు చేయాలని సూచించారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని; విక్రయానికి ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటలు సాగు చేస్తే మేలని అన్నారు. ఆరుతడి పంటల సాగు వివరాల కోసం వ్యవసాయాధికారులను సంప్రదించాలన్నారు. ఆయా సదస్సుల్లో నూతనకల్‌ తహసీల్దార్‌ జమీరుద్దీన్‌, సర్పంచ్‌ తీగల కరుణశ్రీగిరిదర్‌రెడ్డి, ఏవో మురళీ, మద్దిరాల ఎంపీడీవో సరోజ, ఏవో వెంకటేశ్వర్లు, ఉద్యాన వన శాఖ అధికారి స్రవంతి, సర్పంచ్‌ దామెర్ల వెంకన్న, ఎంపీటీసీ శిరంశెట్టి వెంకన్న, ఉపసర్పంచ్‌ అంగిరేకుల వెంకన్న, కార్యదర్శి మంగమ్మ, ఏఈవో రాకేష్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-10T05:26:38+05:30 IST