కొనసాగుతున్న భూనిర్వాసితుల ధర్నా

ABN , First Publish Date - 2021-11-26T06:43:43+05:30 IST

పరిహారం చెల్లించాలని చర్లగూడెం రిజర్వాయర్‌ ముంపు బాధితులు చేపడుతున్న ధర్నా గురువారం 17వ రోజుకు చేరుకుంది.

కొనసాగుతున్న భూనిర్వాసితుల ధర్నా
చర్లగూడెం రిజర్వాయర్‌ వద్ద వంట వార్పు నిర్వహిస్తున్న నర్సిరెడ్డిగూడెం భూ నిర్వాసితులు

మర్రిగూడ, నవంబరు 25: పరిహారం చెల్లించాలని చర్లగూడెం రిజర్వాయర్‌ ముంపు  బాధితులు చేపడుతున్న ధర్నా గురువారం 17వ రోజుకు చేరుకుంది. డిండి ఎత్తిపోతలపథకంలో భాగంగా చర్లగూడెం రిజర్వాయర్‌ కింద ముంపునకు గురైన బాధితులు రిజర్వాయర్‌ వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు లోడే యాదయ్య, పెరమళ్లు, వెంకటయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పరిహారం, పునరావాసం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సర్వం కోల్పోయామని, ప్రభుత్వానికి చీమ కుట్టినటు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం, పునరావాసం కల్పించకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2021-11-26T06:43:43+05:30 IST