నల్లమలలో కొనసాగుతున్న భూవివాదం

ABN , First Publish Date - 2021-08-21T06:23:48+05:30 IST

మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు, రైతుల మధ్య భూవివాదం కొనసాగుతోంది

నల్లమలలో కొనసాగుతున్న భూవివాదం
పాత కంభాలపల్లిలో అటవీ శాఖ అధికారులను అడ్డుకుంటున్న రైతులు

 రోడ్డెక్కిన రైతులు

పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
చందంపేట, ఆగస్టు 20 :
మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు, రైతుల మధ్య భూవివాదం కొనసాగుతోంది. అటవీ భూములని అధికారులు, సాగు భూములని రైతులు మూడు నెలలుగా వివాదాలకు దిగుతున్నారు. మండలంలోని పాతకంభాలపల్లి, సర్కిల్‌తండా గ్రా మాలు అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాయి. గత ప్రభుత్వంలో వీరికి డీఫారెస్ట్‌ కింద భూములను విడదీసి సాగుకు పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి రైతులు వీటిని సాగు చేసుకుంటున్నారు. ఇటీవల అటవీ శాఖ అధికారులు ఈ భూములన్ని తమ పరిధిలోకి వస్తాయని అందులో మొక్కలు నాటే ందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం రైతులు, అటవీ శాఖాధికారుల మధ్య ఘర్షణకు దారితీసి నెల రోజుల క్రితం పోలీస్‌ కేసుల వరకు వెళ్లింది. అటవీ శాఖాధికారిపై రైతులు దాడి చేయడంతో 8మందిపై కేసులు నమోదు చేశా రు. అటవీ శాఖాధికారులు తిరిగి శుక్రవారం కంభాలపల్లి పరిధిలో తిరిగి మొక్కలు నాటేందుకు వెళ్లగా రైతులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. దీంతో అటవీ శాఖాధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో డిండి రూర ల్‌ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీనివ్వడంతో వివాదం సద్దుమణిగింది.


Updated Date - 2021-08-21T06:23:48+05:30 IST