కొనసాగుతున్న కూల్చివేతలు

ABN , First Publish Date - 2021-11-02T06:07:28+05:30 IST

భువనగిరి పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న కూల్చివేతలు
భువనగిరి పట్టణంలో ఎక్స్‌కవేటర్‌తో కట్టడాలను కూల్చివేస్తున్న దృశ్యం

ప్రధాన మురికి కాల్వల నిర్మాణానికి సర్వే 

భువనగిరి టౌన, నవంబరు 1: భువనగిరి పట్టణ ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సోమవారం పలు భవనాలను మునిసిపల్‌ సిబ్బంది పాక్షికంగా కూల్చివేయగా మరికొద్దిమంది యజమానులు స్వ చ్ఛందంగా కూల్చివేసుకుంటున్నారు. కూల్చివేతలతో పట్టణ ప్రధాన రహదారిపై ట్రా ఫిక్‌ జామ్‌ అవుతున్నది. అలాగే భవనాలన్నీ శిథిలంగా కనిపిస్తున్నాయి. భవన య జమానులు, చిరువ్యాపారుల నిరసనలు కొనసాగుతున్నాయి. రహదారి ఇరువైపులా ప్రధాన మురికికాల్వలను నిర్మించేందుకు పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో సర్వే రెండో రోజూ కొనసాగింది.  

కళాశాలలో ఆక్రమణలు నియంత్రించాలని.. 

రోడ్డు విస్తరణ పనులతో కొద్దిమంది ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల ఆవరణను ఆక్రమించేందుకు చేస్తున్న ప్రయత్నాలను నియంత్రించాలని కలెక్టర్‌, బోర్డ్‌ ఆ ఫ్‌ ఇంటర్మీడియట్‌ కమిషనర్‌, నోడల్‌ అధికారి, మునిసిపల్‌ కమిషనర్‌, ఏసీపీకి కళాశాల ప్రిన్సిపాల్‌ పాపిరెడ్డి వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. విస్తరణ పనుల్లో భాగంగా కళాశాల ప్రహారిని తొలగించడంతో కొద్దిమంది ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారని వినతిపత్రాల్లో పేర్కొన్నారు. 

మార్కింగ్‌ లోపే మెట్లు 

100 ఫీట్ల రహదారి విస్తరణకు చేసిన మార్కింగ్‌ లోపే భవనాల మెట్లను నిర్మించుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనలు పాటించకుండా పునర్నిర్మించుకున్న భవనాలను కూల్చివేస్తామని మునిసిపల్‌ కమిషనర్‌ పూర్ణచందర్‌ హెచ్చరించారు. ఏవైనా సందేహాలుంటే అధికారులను సంప్రదించాలని సూచించారు.  

 

Updated Date - 2021-11-02T06:07:28+05:30 IST