కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-02-07T05:29:00+05:30 IST
కరోనా నిర్మూలనలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రారంభమైన కోవిడ్ -19 టీకా వ్యాక్సిన్‌ను శనివారం జిల్లావ్యాప్తంగా పోలీస్, రెవెన్యూ శాఖ సిబ్బందికి ఇచ్చారు.

చండూరు/ కనగల్/ గుర్రంపోడు/ వేములపల్లి/ చిట్యాల/ శాలిగౌరారం/ మర్రిగూడ, ఫిబ్రవరి 6: కరోనా నిర్మూలనలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రారంభమైన కోవిడ్ -19 టీకా వ్యాక్సిన్‌ను శనివారం జిల్లావ్యాప్తంగా పోలీస్, రెవెన్యూ శాఖ సిబ్బందికి ఇచ్చారు. చండూరులో సీఐ సురేష్‌కుమార్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. కనగల్ పీహెచ్‌సీలో కనగల్, చండూరు మండలాల రెవెన్యూ సిబ్బంది మొత్తం 90మంది టీకా తీసుకోవాల్సి ఉండగా 11మంది వచ్చారని డాక్టర్ వరూధిని తెలిపారు. టీకా తీసుకున్న వారిలో కనగల్, చండూరు తాహసీల్దార్లు శ్రీనివాస్‌రావ్, మధుసూదన్, కనగల్ పీఎస్ ఏఎస్‌ఐ నర్సింహ్మరెడ్డి ఉన్నారు. పలువురు సిబ్బంది టీకా తీసుకునేందుకు ముందుకు రాలేదు. గుర్రంపోడు పీహెచ్‌సీలో న లుగురు టీకా తీసుకున్నారని డాక్టర్ నవనీత తెలిపారు. టీకా తీసుకున్న వారిలో తహసీల్దార్ ఆంజనేయులు మరో ముగ్గురు సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. వేములపల్లి పీహె చ్‌సీలో 49మంది పోలీసులకు గాను 16మందికి వేసినట్లు వైద్యాధికారి ముస్తక్‌అహ్మద్ తెలిపారు. శనివారం వ్యాక్సిన్‌కు హాజరుకాని పోలీసులకు సోమవారం వ్యాక్సినేషన్ చేయనున్న ట్లు పేర్కొన్నారు. శాలిగౌరారం పీహెచ్‌సీలో తహసీల్ధార్ ఎర్ర శ్రీనివాసరెడ్డికి టీకా వేశారు. చిట్యాలలో మునిసిపాలిటీ సిబ్బం దికి టీకా వేశారు. మర్రిగూడలో పోలీసులకు టీకా వేశారు.