రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-12-25T07:01:21+05:30 IST

రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ హమాలీ మృతి చెందిన ఘటన నల్లగొండ పట్టణం లోని నార్కట్‌పల్లి అద్దంకి బైపాస్‌ గొల్లగూడ సమీపంలో చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
భీమ్మారెడ్డి మృతదేహం

నల్లగొండ క్రైం, డిసెంబరు 24: రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ హమాలీ మృతి చెందిన ఘటన నల్లగొండ పట్టణం లోని నార్కట్‌పల్లి అద్దంకి బైపాస్‌ గొల్లగూడ సమీపంలో చోటు చేసుకుంది. నల్లగొండ టూటౌన క్రైం ఎస్‌ఐ యాదగి రి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీ కి చెందిన ఎఫ్‌సీఐ విశ్రాంత హమాలీ భీష్మారెడ్డి (65)తన ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం గొల్లగూడ నుంచి అద్దం కి బైపాస్‌ రోడ్డు దాటుతుండగా మిర్యాలగూడ వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీ కొట్టిం ది. ఈ ప్రమాదంలో భీష్మారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందు కున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

 

Updated Date - 2021-12-25T07:01:21+05:30 IST