నూరుశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యం పూర్తి చేయాలి: డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2021-12-08T07:03:37+05:30 IST

నూరుశాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని పూర్తిచేసే విధంగా వైద్యారోగ్యశాఖ క్షేత్రస్థాయిలో పనిచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కొండల్‌రావు సూచించారు.

నూరుశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యం పూర్తి చేయాలి: డీఎంహెచ్‌వో


మిర్యాలగూడ అర్బన్‌, డిసెంబరు 7: నూరుశాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని పూర్తిచేసే విధంగా వైద్యారోగ్యశాఖ క్షేత్రస్థాయిలో పనిచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కొండల్‌రావు సూచించారు. పట్టణంలోని ఐఎంఏ భవనంలో మంగళవారం జరిగిన వైద్య ఆరోగ్యసిబ్బంది సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ మొదటి, రెండో డోస్‌ తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్న వ్యక్తులను క్లస్టర్‌వారీగా గుర్తించి డోర్‌ డెలివరీ పద్ధతిలో వ్యాక్సినేషన్‌ అందించాలని సిబ్బందిని ఆదేశించారు.  సిబ్బంది పనితీరుపై డివిజన్‌స్థాయి అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు.  సమావేశంలో డీఐవో రామ్మోహన్‌రావు, సీహెచ్‌వోలు వెంకయ్య, శ్రీనివా్‌సస్వామి, వాసుదేవరెడ్డి, ఉపేందర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T07:03:37+05:30 IST