నూరుశాతం వ్యాక్సినేషన్‌కు కృషిచేయాలి

ABN , First Publish Date - 2021-11-21T05:57:41+05:30 IST

జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నూరుశాతం పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో కోటాచలం అ న్నారు. జిల్లాకేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో శనివారం జరిగిన గ్రామీణ వైద్యుల, జిల్లా, మండల అధికారుల సమావేశంలో మాట్లాడారు. గ్రామ పరిధిలో గ్రామీణ వైద్యులందరూ ముందుగా వ్యాక్సినేషన్‌ తీసుకోవాలని సూచించారు. గ్రామ పరిధిలో కరోనా వ్యాక్సిన్‌ టీకాలు తీసుకొని

నూరుశాతం వ్యాక్సినేషన్‌కు కృషిచేయాలి
º

సూర్యాపేట కల్చరల్‌, నవంబరు 20: జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నూరుశాతం పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో కోటాచలం అ న్నారు. జిల్లాకేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో శనివారం జరిగిన గ్రామీణ వైద్యుల, జిల్లా, మండల అధికారుల సమావేశంలో మాట్లాడారు. గ్రామ పరిధిలో గ్రామీణ వైద్యులందరూ ముందుగా వ్యాక్సినేషన్‌ తీసుకోవాలని సూచించారు. గ్రామ పరిధిలో కరోనా వ్యాక్సిన్‌ టీకాలు తీసుకొని వారి వివరాలు ఆరోగ్య కార్యకర్తలకు తెలియజేయాలన్నారు. ఈ నెల 23వ తేదీన జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గ్రామీణ వైద్యులకు మండల వైద్య అధికారులతో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఆడ పిల్లల పట్ల వివక్షత మానుకోవాలని, ఎవరైన లింగనిర్థారణ పరీక్షలు చేసినట్లైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు అంజయ్య, లక్ష్మీనర్సయ్య, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

వందశాతం వ్యాక్సినేషన్‌ సాధిస్తాం

నడిగూడెం: జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని సాధిస్తామని  అసంక్రమిక వ్యాధుల నిర్మూలన జిల్లా అధికారి కల్యాణ్‌ చక్రవర్తి అన్నారు. మండలంలోని రత్నవరంలో వ్యాక్సిన్‌ పక్రియను పరిశీలించారు. జిల్లాలోని 23మండలాలల్లో 90శాతానికిపైగా మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయిం దని తెలిపారు. ఈ నెల చివరినాటికి మిగిలిన వాటినిపూర్తి చేసేందుకు ప్ర ణాళిక సిద్ధం చేశామన్నారు. కొన్ని గ్రామాల్లో టీకా వేసుకునేందుకు కొం దరు ముందుకు రావడం లేదని, నడిగూడెం మండలంలో 15గ్రామాలుంటే 13గ్రామాల్లో వందశాతం పూర్తయ్యాని తెలిపారు. నడిగూడెం, కరవిరాల గ్రామాల్లో లక్ష్యం చేరుకోలేక పోయమన్నారు. మండలంలోని రత్నవరం అంగన్‌వాడీకేంద్రంలో ఆదివారం ఆజాద్‌ అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం లో భాగంగా ఆరోగ్యం, మానసిక ఎదుగుదల, పౌష్టికాహారంపై అసంక్రమిక వ్యాధుల నిర్మూలన జిల్లా అధికారి డాక్టర్‌ కల్యాణ్‌చక్రవర్తి వివరించారు. కార్యక్రమంలో వైద్యాధికారి లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-21T05:57:41+05:30 IST