ఎన్నికల హామీలు వందశాతం అమలు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-02-07T04:44:04+05:30 IST

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు వందశాతం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

ఎన్నికల హామీలు వందశాతం అమలు: ఎమ్మెల్యే
కేసీఆర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే సైదిరెడ్డి క్షీరాభిషేకం

హుజూర్‌నగర్‌ / నేరేడుచర్ల/ మఠంపల్లి,  ఫిబ్రవరి 6 : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు వందశాతం ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ముక్త్యాల బ్రాంచ్‌తో పాటు ఎత్తిపోతల పథకాల కోసం సీఎం రూ.1218 కోట్ల నిధులు మంజూరు చేయడంతో హుజూర్‌నగర్‌ పట్టణంలో శనివారం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కృతజ్ఞత సభలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలు వందశాతం అమలు చేశామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చనరవి, వైస్‌చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు, ఎంపీపీ గూడెపు శ్రీనివాసు, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, కెఎల్‌ఎన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కడియం వెంకటరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా నేరేడుచర్లలో జరిగిన సీఎం చిత్రపటానికి క్షీరాభిషేక కార్య క్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షురాలు చల్లా శ్రీలత, చందమళ్ల జయబాబు, మార్కండేయ, సత్యనారాయణరెడ్డి, శ్రీధర్‌, రమే్‌షబాబు, శ్రీరాంరెడ్డి, వెంకటేశ్వర్లు, నారాయణ, సరిత పాల్గొన్నారు. మఠంపల్లిలో ఎంపీపీ ముడావత్‌ పార్వతీకొండానాయక్‌, జడ్పీటీసీ జగన్‌నాయక్‌, కృష్ణంరాజు, అశోక్‌నాయక్‌, శ్రీనివా్‌సరెడ్డి, బ్రహ్మరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-02-07T04:44:04+05:30 IST