చికిత్స పొందుతూ ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-01-13T06:18:01+05:30 IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

చికిత్స పొందుతూ ఒకరు మృతి

ఈ నెల 3న  నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులో రోడ్డు ప్రమాదం

నార్కట్‌పల్లి, జనవరి 12: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి  చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈనెల మూడో తేదీన నార్కట్‌పల్లి శివారులో హెరిటేజ్‌ పార్లర్‌ ఎదుట మండలంలోని తొండ్లాయి గ్రామానికి  చెందిన దాసరి మల్లయ్య (65), బెల్లి లక్ష్మయ్య బైక్‌పై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లయ్యను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-01-13T06:18:01+05:30 IST