బీజేపీతోనే బీసీలకు న్యాయం: ఓబీసీ మోర్చా

ABN , First Publish Date - 2021-12-31T15:59:08+05:30 IST

బీజేిపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ ఓబీిసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దుర్గాపతి లక్ష్మీనారాయణ గౌడ్‌ అన్నారు.

బీజేపీతోనే బీసీలకు న్యాయం: ఓబీసీ మోర్చా

భువనగిరిటౌన్‌, డిసెంబర్‌ 30: బీజేిపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ ఓబీిసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దుర్గాపతి లక్ష్మీనారాయణ గౌడ్‌ అన్నారు. భువనగిరిలో గురువారం ఏర్పాటుచేసిన ఓబీసీ మోర్చా సమావే శంలో ఆయన మాట్లాడారు. దేశానికి నరేంద్రమోదీ రూపంలో  తొలి బీసీ ప్రధానిని చేసిన ఘనత బీజేిపీదేనన్నారు. అలాగే కేంద్ర మంత్రి వర్గంలోనూ ఓబీసీలే అధికంగా ఉన్నారన్నారు. సమావేశంలో మోర్చా పట్టణ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల నగేష్‌, కట్నమోజు ఉషాకిరణ్‌, నాయకులు పట్నం కపిల్‌, ఉడుత భాస్కర్‌, శ్రీధర్‌, ఊదరి విక్రం, వేణు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T15:59:08+05:30 IST