వైభవంగా నృసింహుడి కల్యాణం

ABN , First Publish Date - 2021-12-30T06:30:15+05:30 IST

: మట్టపల్లిక్షేత్రంలో శ్రీరాజలక్ష్మీ, చెంచులక్ష్మీ సమే త శ్రీలక్ష్మీనరసిం హస్వామి నిత్య శాశ్వత కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా బుధవారం నిర్వహించారు. ఆలయంలో విశ్వక్ష్సేన పూజ, పుణ్యాహావాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్వప్రాసన అనంతరం స్వామివారికి మాంగళ్య ధారణ తలంబ్రాలుతో నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం నీరా

వైభవంగా నృసింహుడి కల్యాణం
కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

మఠంపల్లి,డిసెంబరు 29: మట్టపల్లిక్షేత్రంలో శ్రీరాజలక్ష్మీ, చెంచులక్ష్మీ సమే త శ్రీలక్ష్మీనరసిం హస్వామి నిత్య శాశ్వత కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా బుధవారం నిర్వహించారు. ఆలయంలో విశ్వక్ష్సేన పూజ, పుణ్యాహావాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్వప్రాసన అనంతరం స్వామివారికి మాంగళ్య ధారణ తలంబ్రాలుతో నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం నీరాజనమంత్రపుష్పాలతో మహానివేదించిన తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన గరుఢ వాహనంపై స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మీనరసింహమూర్తి, సీతారామశాస్ర్తీ, ఆలయ ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, ఈవో సిరికొండనవీన్‌, శేషగిరిరావు, శ్రీనివాసరావు, సీత, రాజష్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-30T06:30:15+05:30 IST